Saturday 16 June 2012

శ్రీ శక్తి

SHEE  SAKTHI

శ్రీ శక్తి


నేను చాల రోజుల నుండి అనుకుంటున్నాను భక్తి విశేషాలు నేను చదివిన పుస్తకాల నుండి, వేబ్సిట్లానుండి  చదివినవి పొందుపరచాలని ఉండేది . ఇవాల్టికి ఆ పని ఆరామభించాను . నాకు అత్యంత ఇష్తమైన దేవుడు ఆంజనేయ స్వామి అయన గురించి చిన్నపాటి నుండి చాల గురి వుండేది, ఎప్పుడు అనుకునేదాన్ని ఎ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి. ఇవి  నేను చదివిన వాటిలోనివి దయచేసి ఏ మయిన తప్పులుండిన
 క్షమించండి.


పరమ భక్తాగ్రేసరుడైన ఆంజనేయస్వామి సప్తచిరంజీవులలో ఒకరిగా పేర్కొనబడ్డాడు. ఈ స్వామి ఎక్కడెక్కడ శ్రీరామకీర్తన జరుగుతుంటుందో అక్కడక్కడల్లా అంజలి ఘటించి ఆనంద భాష్పాలతో ఉంటానని ఆయనే
ప్రకటించాడు. శ్రీరామ పరివారంలో హనుమంతుడు ప్రథమగణ్యుడు. శివాంశ సంభూతుడైన పవన పుత్ర
హనుమాన్ రామభక్తులందరికీ వందనీయుడు, స్తవనీయుడు. సీతమ్మ శోకం పోగొట్టి లక్ష్మణుని ప్రాణం నిలిపి, శ్రీరాముని మహా విపత్తునుండి తప్పించి లోకానికి శ్రీరామరాజ్య సౌభాగ్యాన్ని అందించిన మహామేధావి హనుమంతుడు.శ్రీరామునికి నిస్వార్థంగా సేవ చేసిన ఏకైక భక్తశేఖరునిగా ప్రసిద్ధి చెందినవాడు మారుతి. పవన
సుతుడు వాయుదేవునంతటి శక్తి సంపన్నుడు. మహా సముద్రాన్ని అవలీలగా లంఘించి దాటినవాడు. గంధర్వ
విద్యతత్వజ్ఞుడు. నవ వ్యాకరణవేత్త. పుట్టిన వెంటనే సూర్య బింబాన్ని ఫలమనుకొని అందుకోడానికి ఎదగడం నుంచి,
అనేక మహాబల పరాక్రమాలను ప్రదర్శించి లోకోత్తరుడైన శ్రీరాముని పాద సేవా దురంధరుని చరిత్ర కడుపావనము, నిత్య పారాయణార్హము. సీతానే్వషణ సమయంలో సుగ్రీవుని వద్దకు వచ్చిన శ్రీరామలక్ష్మణులను ప్రథమ వీక్షణంలోనే వారి విశిష్టత గ్రహించిన మహాధీశాలి, కుశాగ్రబుద్ధి హనుమంతుడు. శ్రీరామ సుగ్రీవ సఖ్యత అగ్నిసాక్షిగా జరిపించాడు. రావణాసురుడు ఎత్తుకు పోయిన సీతను అనే్వషించడంలో హనుమంతుని శక్తిసామర్థ్యాలు క్తమయ్యాయి. సీతమ్మకు రాముని అంగుళీయక మందించి, ఆయమ్మ ఇచ్చిన చూడామణిని రామునికందించి స్వాంతన చేకూర్చాడు. రావణునికి పరస్ర్తి వ్యామోహంవల్ల కలిగే అనర్థాలను వివరించడంలో ఆయన విజ్ఞత
బహిర్గతమయింది. యుద్ధ సమయంలో లక్ష్మణ మూర్ఛ సందర్భంగా ఔషధ వివరం తెలియక, సంజీవని పర్వతానే్న
ఎకాఎకిన పెకలించి తెచ్చిన మహాబలవంతుడు. విభీషణ శరణాగతి సమయంలో విభీషణుని తమలో కోవాలావద్దా అనే చర్చలో హనుమంతుని అభిప్రాయం అడుగుతాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ హనుమంతుని పరేంగిత
జ్ఞానం, రాజనీతి వైదుష్యము వెల్లడయ్యాయి. శరణాగతుడైన విభీషణుని రక్షించ తగునని సూచించాడు.
శ్రీరామ తత్వాన్ని, ఔన్నత్యాన్ని చూడగానే గ్రహించి, తన జీవితాన్ని ఆయనకు అంకితం చేసి, కైంకర్యం చేసి,

హనుమంతుడు చరితార్థుడయ్యాడు. ఆంజనేయుని భక్తి, శక్తియుక్తులు ఒకదానికొకటి పోటీపడేటట్లు, ఒక
దానిని మించి ఒకటి ఉన్నట్లు గ్రహించవచ్చు. ఆయన మూర్తి, కీర్తి, నేర్పు, ఓర్పు దేవముఖ్యునిగా చేసాయి.
హనుమంతుని సన్నిధికోసం మానవులేకాక, సిద్ధులు సాధ్యులు, యక్షులు, కినె్నరలు, కింపురుషాదులు
కూడా తీవ్ర భక్త్భివంతో ఆరాధిస్తూనే ఉంటారు.సాకినీ, ఢాకినీ, యక్షిణీ, కామినీ, మోహినీ, భూత, ప్రేత, భేతాళ,
కూష్మాండాది పిశాచాలు, దెయ్యాలు ఆయనను తలచుకోగానే పటాపంచలయిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువలన రామభక్తాగ్రేసరుడు అయిన హనుమంతుని ఉపాసన ఎంతో శ్రేయస్కరమైనది. పరమ
భక్తునకు అసాధ్యమేదీ లేదనుటకు చక్కని తార్కాణం హనుమంతుని దివ్య చరిత్ర. ‘ఈ భూమి మీద శ్రీరామ నామం
ఉన్నంతకాలం తాను చిరంజీవిగా ఉండగలిగే’’ వరాన్ని పొందిన ఆంజనేయస్వామిని...యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ త్ర తత్ర కృతమస్తకాంజలిమ్!
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత

రాక్షసాంతకమ్!!
అంటూ వేదవ్యాసుని పితృదేవుడు పరాశరుడు రచించిన పరాశర సంహితననుసరించి వైశాఖ బహుళ దశమినాడు సంభవించే ఈ హనుమజ్జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయుని మనసారా స్మరించుకుందాం. ఆయన నిజమైన కర్మయోగి, నిర్భయమైన, నిస్వార్థసేవ, నమ్రత వంటి ఉత్తమ గుణాలు రామభక్తి ద్వారా నిరూపించిన

మహాత్ముడు, మహావీరుడు మారుతి సదాపూజనీయుడు.


ఎక్కడక్కడైతే శ్రీరామ గానం జరుగుతుంటుందో, అక్కడ శిరస్సు వంచుకుని కళ్లలో ఆనంద బాష్పములు నిండగా తన్మయుడై రామకథను ఆస్వాదించే రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిద్దాం. మనోజవుడు, వాయువేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో వరిష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సేనలో ముఖ్యుడు, శ్రీరామదూత అయన ఆంజనేయస్వామిని స్మరించడంవలన బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, భయం లేకుండుట, రోగాలు లేకుండా, పటిష్టమైన వాక్కు లభిస్తాయని పెద్దలు చెప్పారు.
తిరుమల పర్వతాలలో గల అంజనాద్రిపై, అంచనాదేవి తపస్సు చేసింది. ఈ ప్రాంతంలోనే గల జాబాలి అనే ప్రదేశం నందు ఆంజనేయుడు జన్మించాడని కొందరు, నాసిక్ నుండి త్య్రంబకం వెళ్లే మార్గంలో అంజనేరి అనే గ్రామం వుంది. ఇక్కడే ఆంజనేయస్వామి జన్మించాడని మరికొందరు అంటారు. త్య్రంబకం గోదావరీ నది పుట్టిన ప్రదేశం. అక్కడే గౌతమ మహర్షి తపస్సు చేసాడు. ఆయన తపోఫలంగా గోదావరి నది జన్మించింది. గౌతమ మహర్షి కుమార్తె అంజనాదేవి. ఆ సమీపంలోని అంజనేరిలో తపస్సుచేసి ఆంజనేయస్వామిని పుత్రుడినిగా పొందిందంటారు కొందరు.
ఆంజనేయస్వామి శివాంశ సంభూతుడు. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించబోతున్న సమయంలో, రాముడిగా సహాయంగా వుండేందుకు దేవతలు వానరులను సృష్టించారు. ఆ సమయంలో శివుడు, తన అంశతో ఆంజనేయస్వామిని సృష్టింపచేశాడు.
కేసరి అనే వానర రాజు భార్య అంజనాదేవి. ఈ అంజనాదేవికి వాయుదేవుడు శివ అంశను మోసుకొచ్చి అందజేశాడు.
కనుకనే, కేసరి నందనుడు, వాయుపుత్రుడు అనే పేర్లు కలిగాయి. శివుడు, పార్వతీదేవి- ఇద్దరూ వేర్వేరు కారు. శివ శక్తులు ఒక్కరే. అదే అర్థనారీశ్వర తత్త్వం. అందువలన అమ్మవారు కూడా వచ్చి, ఆంజనేయస్వామి తోకలో ప్రతిష్టితురాలైంది. అందుకనే, ఆంజనేయస్వామికి, ‘వాలపూజ’ ప్రత్యేకతను పొందింది. నలభై రోజులపాటు- స్వామివారి తోకకు రోజుకొక చందనం ఆ పైన కుంకుమ బొట్టు చొప్పున పెట్టి పూజిస్తే, నలభై రోజుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.


ఈ స్వామివారు సూర్యుని వద్ద విద్యనభ్యసించారు.
మానవుని శరీరం పంచభూత నిర్మితం. ఆంజనేయస్వామి ఈ పంచభూతములను సమన్వయం చేశాడు. ఎలా అంటే.. స్వామివారు వాయుపుత్రుడు. సముద్రమును అంటే నీటిని ఆకాశమార్గమున దాటాడు. మూడు వచ్చినయ్యా! భూమి సుత అయిన సీతమ్మ వారిని దర్శించాడు. వస్తూ, వస్తూ లంకను అగ్నికి ఆహుతి చేశాడు. ఈ విధంగా పంచభూతములను సమన్వయం చేశాడు కనుక ఆంజనేయస్వామి కథానాయకుడుఅయ్యాడు.
మరో కోణంలో నుండి చూస్తే... ఆంజనేయస్వామి దేవీ ఉపాసకుడు. అణిమాది సిద్ధులను కూడా పొందాడు. సుందరకాండమును దేవీపరంగా కూడా అన్వయించి చెబుతారు. అందుకనే, నవరాత్రులలో సుందరకాండ పారాయణం చెయ్యమని చెబుతారు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
ఎవరి మనసునందు పరబ్రహ్మ అయిన భగవంతుడు సంచరిస్తుంటాడో అతను బ్రహ్మచారి. అలా పరబ్రహ్మ సంచరించేలా, పరబ్రహ్మ ధ్యానంలో గడపటం బ్రహ్మచర్యం. ఈ విధంగా సీతారాములు వనవాస కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించారు.



పరాశర సంహితను ఆధారంగా స్వామివారికి వివాహం అయింది. స్వామివారి విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత తల్లి అంజనాదేవి దగ్గరకు వస్తాడు. అంజనాదేవి వివాహం చేసుకోమని స్వామివారిని అడుగుతుంది. స్వామివారు కాదంటాడు. ఆ సమయానికి నారదులవారు కూడా అక్కడకు వస్తారు. నారదులవారు కూడా నచ్చచెబుతాడు. స్వామివారు అంగీకరిస్తారు. సూర్యుడు తన కూతురు సువర్చలాదేవిని ఇస్తాడు. ఆంజనేయస్వామి ఆమెను వివాహం చేసుకొని, తక్షణం ఆమెను తనలో విలీనం చేసుకుంటాడు. సువర్చలాదేవి, ఆంజనేయస్వామిలో విలీనమై వుంటుంది. ఆ తరువాత తల్లి అంజనాదేవి చెప్పగా, సుగ్రీవుని వద్ద మంత్రిగా చేరుతాడు. ఆంజనేయస్వామి లంక నుండి తిరిగి వస్తుండగా, స్వామి శరీరం నుండి చెమట బిందువులు కొన్ని రాలి సముద్రంలో పడినాయి. దీర్ఘదేహి అనే మత్స్యకన్య ఈ స్వేదాన్ని మింగింది. ఆ విధంగా ఆంజనేయస్వామికి పుత్రుడు జన్మించాడు. అతని పేరు మత్స్యవల్లభుడు. దీర్ఘదేహికి, తన పుత్రుడు ఆంజనేయస్వామి సంతానం అని తెలుసు. తండ్రి దర్శనార్థం దీర్ఘదేహి తన కుమారుడిని మైరావణుని కొలువులో వుంచింది. ఆంజనేయస్వామి మైరావణుని సంహరించిన సమయంలో తండ్రీ కొడుకులిద్దరూ కలుసుకున్నారు. ఆంజనేయస్వామి మైరావణుని సంహరించి, అతని కుమారుడైన నీలమేఘునికి పట్ట్భాషేకం చేశాడు. తన పుత్రుడైన మత్స్యవల్లభుని అతనికి సహాయంగా వుండమని నియమించాడు.


ప్రసన్నాంజనేయ, వీరాంజనేయ, వింశతి భుజ ఆంజనేయ, పంచముఖ ఆంజనేయ, అష్టాదశ భుజ ఆంజనేయ, సువర్చలాంజనేయ, చతుర్భుజ ఆంజనేయ, ద్వాత్రింశద్భుజ ఆంజనేయవానరాకార ఆంజనేయస్వామిగా ఆంజనేయుడు తొమ్మిది అవతారాలనుదాల్చాడు.
ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. పరమశివుడు వందవతారములు ధరించాడు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామి తొమ్మిది అవతారములు ధరించాడు.
అయిదు ముఖాలు, పది చేతులు, పది చేతులలో పది రకాల ఆయుధాలతో ఉండే మూర్తి పంచముఖ ఆంజనేయస్వామి, తూర్పున వానరముఖం, దక్షిణమున నరసింహముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహ ముఖం, ఊర్ధ్వభాగాన హయగ్రీవ ముఖం ఉంటాయి.
ప్రతీ ముఖానికి మూడు నేత్రాలు చొప్పున మొత్తం పదిహేను ముఖాలు వుంటాయి. ఇది పూర్ణ రుద్రావతారమూర్తి.
విభీషణుడి కుమారుడు అయిన నీలుడు ఉపాసించిన మూర్తి ఈ పంచముఖ ఆంజనేయస్వామి.
సీతమ్మతల్లి శతకంఠరావణుడు అనే రాక్షసుని సంహరించింది.ఆ సమయంలో సీతమ్మ వాహనంగా నిలిచాడు. సీతమ్మ పంచముఖ ఆంజనేయస్వామి భుజం మీద కూర్చుని శతకంఠరావణునితో యుద్ధం చేసింది. ఒంగోలు పట్టణంలో లాయరుపేటలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వుంది. ఆ ఆలయంలోనే ఆంజనేయస్వామి యొక్క తక్కిన అవతారమూర్తులను చూడవచ్చు. చాలా విశేషమైన ఆలయం.

లంకలోని సీతమ్మకు తన శక్తి సామర్థ్యాలను తెలియచేయటానికి ఆంజనేయస్వామి తన విశ్వరూపాన్ని చూపాడు. అన్ని కాలాలకు తగినట్లుగానే వుండేదే ఆంజనేయస్వామి చరిత్ర.  అందుకే ఆంజనేయ స్వామి పూజలు కోరిన కోరికలు తెర్చడానికి ఇంక పరమాత్వ తత్వాన్ని కలగాజేయదినికి ఎంతో దోహదపడుతుంది .

  రామ రక్షా స్తోత్ర మ్  
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః
ధ్యానమ్ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్
స్తోత్రమ్చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం
శ్రీరామ జయరామ జయజయరామ